Oct 11,2023 20:59

నెల్లూరులో విజయసాయిరెడ్డి

విపిఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో విజయసాయిరెడ్డిని కలిసిన మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరులో విజయసాయిరెడ్డి
జిల్లాలో మూడ్రోజులు మకాం
ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి:ఎంపి వైసిపి జిల్లా సమన్వయ కర్త విజయసాయిరెడ్డి బుధవారం నెల్లూరుకు వచ్చారు.మూడ్రోజుల పర్యటన నిమిత్తం తన స్వగ్రామం ముత్తుకూరు మండలం, తాళ్లపూడికి చేరుకున్నారు. గ్రామంలో చేపట్టే వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఆయన వెంట ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, తిరుపతి ఎంపి గురుమూర్తి గ్రామంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. సాయంత్రం నెల్లూరు నగరంలోని విపిఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకున్నారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆయనతో భేటి అయ్యారు. గురు, శుక్రవారాలు ఎనిమిది నియోజకవర్గాల ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.