
నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు
ప్రజాశక్తి - టెక్కలి: దసరా సెలవులు ముగియడంతో ప్రభుత్వ యాజమాన్య పరిధిలోని పాఠశాలలు బుధవారం నుంచి తెరుచుకోనున్నాయి. విద్యాశాఖ క్యాలండర్ ప్రకారం ఈనెల 14 నుంచి 24వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. ముందుగా 23న దసరా అని భావించిన ప్రభుత్వం 25వ తేదీ నుంచి పాఠశాలలు తెరిచేందుకు నిర్ణయించింది. 24వ తేదీన కూడా దసరా సెలవును పొడిగించడంతో, పాఠశాలల ప్రారంభం తేదీని ఒక రోజు పొడిగిస్తారని భావించారు. ప్రభుత్వం సెలవును పొడిగించకపోవడంతో, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం నుంచే పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి.