Aug 16,2023 22:06

నేత పరిశ్రమకు అండగా నిలబడ్డాం: మంత్రి రోజా
ప్రజాశక్తి- నగరి:
నేత పరిశ్రమకు అండగా నిలబడ్డామని రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక, యువజన సర్వీసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్కేరోజా అన్నారు. నేత కార్మికులు ఎక్కువగా నివశించే మున్సిపల్‌ పరిధి సత్రవాడలో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె పర్యటించారు. నాలుగేళ్ళలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా చేకూరిన లబ్దిని నివాశితులకు వివరిస్తూ సంక్షేమ బుక్‌లెట్స్‌ను అందజేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ మరమగ్గ కార్మికులకు అనేక విధాలుగా తాము అండగా నిలబడ్డామన్నారు. 20.5లక్షల మీటర్ల ప్రభుత్వ యూనిఫామ్‌ ఆర్డర్లను అందించడం జరిగిందన్నారు. ఈ ఆర్డర్లు 3వేల మందికి కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో ఉపాధి కల్పించిందన్నారు. ఆప్కో వారి బైలా సవరణ చేసి మరమగ్గ కార్మికలకంటూ ఆర్డర్లు తెప్పించడం జరిగిందన్నారు. నవీకరణ దిశగాను నేతపరిశ్రమను నడపాలన్న ఆకాంక్షతో ఆటోలూమ్‌, అండర్‌పిక్‌ లూమ్‌, పట్టుచీరల తయారీ యంత్రాలు అంటూ అత్యాధునిక మరమగ్గాలు అహ్మదాబాద్‌ మరమగ్గ తయారీ సంస్థతో చర్చించి ట్రయల్‌ రన్‌ క్రింద తెప్పించి శిక్షణ అందించడం జరిగిందన్నారు. నేత పరిశ్రమకు చెందిన వారి వ్యాపారాలను దష్ఠిలో ఉంచుకొని ఏకాంబకుప్పం రైల్వేస్టేషన్‌ నుంచి గతంలో ఆపిన ట్రైన్లు అధికారులతో చర్చించి పునరుద్దరించడం జరిగిందన్నారు. టీడీపీ నాయకులకు అధికారదాహం తప్ప ప్రజాశ్రేయస్సు పట్టదన్నారు. పద్నాలుగేళ్లు పాలించిన ఆ పార్టీ ప్రజలకు ఏం మేలు చేసిందో ఆలోచించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పీజీ నీలమేఘం, వైస్‌చైర్మన్‌ బాలన్‌, రాష్ట్ర మొదలియార్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బాలకష్ణ, మున్సిపల్‌ పార్టీ కన్వీనర్‌ బీఆర్వీ అయ్యప్పన్‌, జిల్లా నేత అనుబంధశాఖ అధ్యక్షులు కన్నాయిరం, మున్సిపల్‌ సచివాలయ కన్వీనర్‌ దయానిధి, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, మెప్మా టీఎల్‌ఎం సునీత, కౌన్సిలర్లు పాల్గొన్నారు.