Sep 20,2022 21:40

నేషనల్‌ కరాటే ఛాంపియన్షిప్‌ పోటీల్లో
పుంగనూరు విద్యార్థుల ప్రతిభ
ప్రజాశక్తి- పుంగనూరు:
నేషనల్‌ కరాటే ఛాంపియన్షిప్‌ పోటీల్లో పుంగనూరు విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనపరిచారని జిల్లా కరాటే సంఘం అధ్యక్షులు టి.సునీల్‌ మంగళవారం ఓప్రకటనలో తెలిపారు. కల్నల్‌ సంతోష్‌ బాబు మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈనెల18వ తేదీ హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కర్‌ రెడ్డ్‌ ఇండోర్‌ స్టేడియంలో పోటీలో నిర్వహించారు. నేషనల్‌ కరాటే ఛాంపియన్షిప్‌లో పుంగనూరు కరాటే అకాడమీకి చెందిన విద్యార్థులు 12 మంది పాల్గొని తమ ప్రతిభ చాటారు. కార్యక్రమంలో పాల్గొని ప్రధమ, ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్నట్లు తెలిపారు. విజేతలను రాష్ట్ర కరాటే అధ్యక్షులు రామచంద్ర అభినందించారు. ఈపోటీల్లో ముఖ్య రెఫరీలుగా మంజునాథ్‌, రెడ్డి మహేష్‌ వ్యవహరించారు.