May 05,2023 22:12

సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ శ్రీనివాసరావు

        గార్లదిన్నె : మండలంలో నేరాల శాతాన్ని తగ్గించాలని ఎస్పీ శ్రీనివాసరావు పోలీస్‌ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం శింగనమల, గార్లదిన్నె మండలాల్లోని తరిమెల, నాగలగుడ్డం, ఇల్లూరు, కల్లూరు గ్రామాల్లో ఎస్పీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు కక్షలు, కొట్లాటలకు వెళ్లకుండా ప్రశాంత జీవనం గడపాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడినా క్రిమినల్‌ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం గార్లదిన్నె పోలీస్‌స్టేషన్‌ సందర్శించి రికార్డులు పరిశీలించాడు. ఇందులో భాగంగా కేసుల వివరాలను ఎస్‌ఐ సాగర్‌ను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. సీసీ కెమెరాలు ఎక్కువగా పెట్టించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకట శివారెడ్డి, సిఐ అన్సార్‌బాషా, తదితరులు పాల్గొన్నారు.