Sep 19,2023 21:56

ఎల్‌.దైవప్రసాద్‌, పర్యవేక్షక ఇంజినీర్‌

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఎపి ఇపిడిసిఎల్‌ కోటబొమ్మాళి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కార్యాలయంలో సిజిఆర్‌ఎఫ్‌ ఆధ్వర్యాన ఈనెల 20వ తేదీన అవగాహనా సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ పర్యవేక్షక ఇంజినీర్‌ ఎల్‌.దైవప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సదస్సుకు వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక చైర్మన్‌ డాక్టర్‌ బి.సత్యనారాయణ హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు నిర్వహించే సదస్సులో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి తగు సూచనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యుత్‌ సరఫరాలో వచ్చే అంతరాయాలు, హెచ్చుతగ్గులు, మీటరు, విద్యుత్‌ బిల్‌ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.