నేడు వైసిపి విస్తృతస్థాయి సమావేశం
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశాన్ని ఈనెల 29వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి పార్టీ సమన్వయకర్త, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ హాజరు కానున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు పాల్గొంటారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, అన్ని మండలాల జెసిఎస్ కో-ఆర్డినేటర్లు, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, ఎంపిపిలు, జెడ్‌పిటిసిలు, బిసి కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు హాజరు కావాలని కోరారు.










