భీమవరం రానున్న పలువురు ప్రముఖులు
ప్రజాశక్తి - కాళ్ల
భీమవరం ఆదర్శనగర్‌లో పాతపాటి సర్రాజు స్వగృహం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో సర్రాజు స్మారక సభ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. పాతపాటి సర్రాజు కుమారులు వెంకట శ్రీనివాసరాజు, యుగంధర్ నాగవర్మ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. సర్రాజుకు శ్రద్ధాంజలి తెలిపే ఫ్లెక్సీలను భారీస్థాయిలో ఏర్పాటు చేశారు. సంస్మరణ సభ సోమవారం ఉదయం పది గంటలకు ప్రారంభం కానుంది. సభకు శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్, ధర్మాన ప్రసాదరావు, ఎంపీలు మిథున్‌రెడ్డి, మార్గాని భరత్, కోటగిరి శ్రీధర్, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ఎంఎల్‌ఎలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (చంద్రగిరి), మంతెన రామరాజు (ఉండి), గ్రంధి శ్రీనివాస్ (భీమవరం), డి.నాగేశ్వరరావు (కైకలూరు), అబ్బాయిచౌదరి (దెందులూరు), తెల్లం బాలరాజు (పోలవరం), పుప్పాల వాసు బాబు (ఉంగుటూరు), జెడ్‌పి ఛైర్మన్ కవురు శ్రీనివాస్, ఎంఎల్‌సి జగ్గిరెడ్డి, వైసిపి నేత వంకా రవీంద్రనాధ్, మాజీ ఎంఎల్‌ఎ వేటుకూరి వెంకట శివరామరాజు హాజరు కానున్నారని పాతపాటి వాసు, వర్మ తెలిపారు.










