ప్రజాశక్తి-తిరుపతి సిటి
తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో తాను నటించిన ఎస్‌ఆర్ కల్యాణ మండపం చిత్రాన్ని విజయవంతం చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా తాను నటించిన సబాస్టిన్ పిసి.524 చిత్రం 4న విడుదలవుతుందని, తిరుపతిలో జయశ్యామ్ థియేటర్లో ఈ చిత్రం విడుదలవుతుందని తెలిపారు. తన విద్యాభ్యాసం ఎక్కువ శాతం తిరుపతిలోనే జరిగిందని, తిరుపతి, బైరాగిపట్టెడ, గాంధీరోడ్డు, బాలాజీకాలనీ వంటి ప్రాంతాల్లో ఎక్కువ రోజులు ఉన్నానని, తనకు తిరుపతి అంటే ఇష్టమన్నారు. రేచీకటి వల్ల ఇబ్బందులు, అది కూడా ఓ పోలీసు కానిస్టేబుల్‌కు రేచీకటి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందనే కథా వృత్తంతో ఈ సినిమా తీశారన్నారు. దర్శకులు బాలాజీ తన స్నేహితుడికి రేచీకటి ఉండటాన్ని గమనించాడని, యథార్ధంగా అతనికి జరిగిన సంఘటనలను ఆదారంగా ఈ చిత్రాన్ని నిర్మించారని తెలిపారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూడాలని కామిడి, ఎమోషనల్‌తో సాగే చిత్రమని పేర్కొన్నారు. తాను ప్రస్తుతం మరో 4 చిత్రాల్లో నటిస్తున్నానని, ఈ ఏడాది సమ్మతము, నేను నీకు బాగా కావాల్సినోన్ని, వినరాబాగ్యంపు విష్ణుకథ, వంటి చిత్రాలతో పాటో మరో చిత్రం కూడా విడుదలవుతుందన్నారు. శుక్రవారం విడుదలయ్యే సబాస్టిన్ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి ఆదరించాలని కోరారు. ఈ సమావేశంలో నిర్మాతలు సిద్దారెడ్డి, బయ్యరెడ్డి పాల్గొన్నారు.










