Oct 12,2023 21:33

ప్రజాశక్తి - శ్రీకాకుళం: జాతీయ పోస్టల్‌ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని హెడ్‌ పోస్టాఫీసులో శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఆధార్‌ మేళాను నిర్వహిస్తున్నట్లు హెడ్‌ పోస్టుమాస్టర్‌ దన్నాన చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆధార్‌ కార్డులో సవరణలు, మొబైల్‌ నంబరు, పేరు, అడ్రస్‌ వంటి మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. హెడ్‌ పోస్టాఫీసు కల్పిస్తున్న ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.