ప్రజాశక్తి - క్యాంపస్ : నేషనల్ సైన్స్ డే, మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ విమెన్ సేఫ్టీ, సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమేన్స్ స్టడీస్, మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, తిరుపతి అర్బన్ పోలీస్ ఏ.పి.మాస్, సంయుక్త ఆధ్వర్యంలో శనివారం మహిళా శక్తిని చాటిచెబుతూ మహిళా విశ్వవిద్యాలయం నుండి, బాలాజీ కాలనీ లోని పూలే విగ్రహం వరకు, నినాదాలతో కూడిన పవర్ వాక్ ను నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య దువ్వూరి జమున అంతర్జాతీయ మహిళా దినోత్సవ థీమ్ 2022 గురించి మాట్లాడుతూ, లింగ వివక్షతను రూపుమాపినప్పుడే సమ స్వామ్య వ్యవస్థ మరియు సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. దేశభవిష్యత్తు లింగ సమానత్వం తోనే ముడిపడి ఉందని తెలిపారు. విద్యార్థులు ఆదర్శ మహిళల జీవితాలను స్పూర్తి గా తీసుకుని పూర్తిగా తాము ఏర్పరుచుకున్న లక్ష్యాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం ముఖ్య అతిథి నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి ఆర్ కే రోజా మాట్లాడుతూ నేడు మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ, లింగ వివక్షత కారణంగా అనేక అడ్డంకులను అవరోధాలను ఎదుర్కొంటున్నారన్నారు. ఆత్మనూన్యత, భయము వీడి ఆత్మవిశ్వాసం మరియు సానుకూల దృక్పథం అలవర్చుకుని జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ ఉన్నత శిఖరాలను చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి, యూనియన్ బాంక్ మేనేజర్ శ్రీమతి. విజయలక్ష్మి, లా విభాగ ఆచార్యులు చంద్రకళ, స్వచ్చందసేవాసంస్థ ఏ. పి. మాస్ మొదలైన వారు కూడా స్పాన్సరర్స్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డి ఎమ్ మమత, డీన్స్ ప్రో. భారతి, ప్రో.నాగరాజు ప్రో.సారా సరోజిని, ప్రొఫెసర్ సంధ్యారాణి, ప్రో. సావిత్రి, ప్రొఫెసర్ శారద, డా. రజని, ప్రొఫెసర్ సుజాత, ప్రో. చంద్రకళ, బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థులు , పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










