నేడు చంద్రబాబు నాయుడు రోడ్ షో
ప్రజాశక్తి- వెదురుకుప్పం: కార్వేటినగరంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు జరిగే బాదుడే బాదుడు కార్యక్రమానికి జాతీయ టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారని, ఈ సందర్భంగా జరిగే రోడ్‌షో ను విజయవంతం చేయాలని టిడిపి జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని పిలుపునిచ్చారు. గురువారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీడి నెల్లూరు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు కార్వేటినగరంలో జరిగే చంద్రబాబు నాయుడు రోడ్‌షోలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం కార్వేటినగరం రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటుచేసిన బ్యానర్స్, కటౌట్లను పరిశీలించారు. జీడి నెల్లూరు టీడీపీ ఇన్‌ఛార్జి చిట్టిబాబు నాయుడు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేసి సభను జయప్రదం చేయాలని కోరారు. మండల పార్టీ అధ్యక్షులు చెంగల్రాయల్ యాదవ్, కార్యదర్శి రాజేందర్ రెడ్డి, మాజీ వైస్‌ఎంపీపీ తోటి రవికుమార్, దాసరి గణేష్, కుమారస్వామి రాజు, పర్వేజ్, సోమశేఖర్, మురళి, ప్రసాద్, జయచంద్ర యాదవ్, వాసుదేవరెడ్డి, బిగల రమేష్, శ్రీధర్, ధనంజయరాజు, రాధాకృష్ణ యాదవ్, దస్తగిరి పాల్గొన్నారు.










