Sep 19,2022 21:07

నేడు చంద్రబాబు చిత్తూరుకి రాక
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:
జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు చిత్తూరు షెడ్యూల్‌ ఖరారైంది. 20వ తేదీ మంగళవారం ఉదయం 12గంటల లోపల రేణిగుంట విమానాశ్రయంమునకు చేరుకుంటారు. అక్కడ నుండి రోడ్డు మార్గాన వయా చంద్రగిరి, నేండ్రగుంట, పూతలపట్టు మీదుగా చిత్తూరు జిల్లా, గిరింపేట నందుగల జిల్లా కారాగారం (జిల్లా జైలు) వద్దకు మధ్యాహ్నం 2 గంటల చేరుకోనున్నారు. కుప్పంలో అన్న క్యాంటీన్‌ ఏర్పాటులో చోటు చేసుకున్న ఘర్షణల్లో చిత్తూరు సబ్‌జైల్లో ఉన్న కుప్పం నియోజకవర్గంకు చెందిన మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, కుప్పం నియోజకవర్గ టిడిపి నాయకులను కలిసి పరామర్శిస్తారు. సబ్‌జైలు నుండి స్థానిక గంగనపల్లిలోని చిత్తూరు మాజీ మేయర్‌ కటారి హేమలత నివాసానికి చేరుకొని పరామర్శించనున్నారు.