Mar 28,2022 23:13

నాటుసారా తరలిస్తున్న వ్యక్తి అరెస్టు చేస్తున్న దశ్యం


ప్రజాశక్తి- కలకడ:

.స్థానిక పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి., మండల కేంద్రమైన కలకడ కాలువ గడ్డ వీధికి చెందిన కరీముల్లా కుమారుడు షేక్‌ నందిబారు గారి ఆశ్రఫ్‌ అలీ బాలయ్య గారి పల్లి పంచాయతీ ఎర్రయ్య గారి పల్లె సమీపంలో ఉన్న ఎస్‌ టి నీ కాలనీ వద్ద నాటుసారా తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారం మేరకు దాడులు నిర్వహించారు.ఈ దాడులలో షేక్‌ నంది బారు గారి ఆశ్రఫ్‌ అలీ అటువైపు నుంచి వస్తున్నట్లు గమనించిన పోలీసులు అతనిని పరిశీలించగా అతని వద్ద 10 లీటర్ల నాటుసారా ఉన్నట్లు గుర్తించి విచారించగా తాను నాయిని వారి పల్లె కి చెందిన నాగయ్య వద్ద నుండి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పది లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్‌ఐ తెలిపారు.