ప్రజాశక్తి- తిరుపతి సిటీ
స్థానిక రేణిగుంట రోడ్డులోని హాస్పిటల్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునందకుమార్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రజలకు అత్యాధునికమైన పరికరాలతో నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో నారాయణాద్రి హాస్పిటల్ స్థాపించామన్నారు. తమ ఆస్పత్రిలో ఎప్పటికప్పుడు డయాలసిస్ వైద్యాన్ని ఆధునిక పద్ధతిలో అందిస్తున్నామన్నారు. ఆస్పత్రికి వచ్చే ప్రతి కిడ్నీ పేషెంట్‌కు మంచి సౌకర్యాలతో నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో 2017లో అపోలో డయాలసిస్ వారితో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఇప్పటి వరకు దాదాపు 12వేల డయాలసిస్ సెక్షన్లు పూర్తి చేశామని తెలిపారు. అనుభవం కలిగిన యూరాలజీ ప్రముఖ వైద్యులు విజయభాస్కర్ రెడ్డి, నెఫ్రాలజీ ప్రముఖ వైద్యులు భవాని మోహన్ రాజు అత్యుత్తమైనటువంటి పరికరాలతో, అత్యాధునిక వైద్యం అందిస్తున్నామన్నారు. కిడ్నీలో రాళ్లు తొలగించడానికి నూతనమైన హౌల్మీయం లేజర్, ప్లేక్సీబుల్ స్కోపీ వంటి అత్యాధునిక పరికరాలు ఉండటం వలన, ఆపరేషన్ చేసిన రెండు, మూడు రోజుల్లోనే తన పని తాను చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ఎస్ వి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జి. ఉషారాణి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్రమణియన్, పాల్గొన్నారు.










