ప్రజాశక్తి-అనంతపురంకలెక్టరేట్ ముందస్తు అక్రమ అడ్మిషన్లు చేస్తున్న నారాయణ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ముందస్తు అడ్మిషన్లకు పాల్పడుతున్న జీసెస్‌నగర్‌లోని నారాయణ పాఠశాల ముందు ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌బి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమైక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు పాపిరెడ్డిపల్లి పృథ్వీ, సురేష్‌యాదవ్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే విద్యార్థి తల్లిదండ్రులను మభ్యపెట్టి అక్రమ అడ్మిషన్లకు పాల్పడటం బాధాకరమన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని నారాయణ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు నరేష్, మను, ధనుష్, ప్రవీణ్, మనోజ్, తదితరులు పాల్గొన్నారు.
ధర్నా నిర్వహిస్తున్న ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా










