Aug 17,2022 23:07

సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్‌
నాడు- నేడు రెండవ విడత కార్యక్రమంలో మంజూరు అయిన పనులను వేగవంతంగా ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ ఎం. హరి నారాయణన్‌ అన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచించారు.బుధవారం మధ్యాహ్నం కలెక్టర్‌ చిత్తూరు పట్టణంలోని సికేపల్లిలో గల జ్యోతి రెడ్డి మెమోరియల్‌ హై స్కూల్‌, వరదప్ప నాయుడు హై స్కూల్‌ లలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మొదట సికె పల్లి లో 21 లక్షలతో చేపట్టిన పనుల వివరాలను పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణాలను వేగవంతంగా చేయాలని పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తూ పనులను పూర్తి చేయాలని అన్నారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి
చిత్తూరుఅర్బన్‌: :
సచివాలయాల నిర్వహణ ఒక క్రమబద్ధతిలో ఉండాలని, వివిధ పథకాలకు సంబంధించిన అర్హుల జాబితా లబ్ధిదారులకు కనపడేటట్లు అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ ఎం. హరి నారాయణన్‌ అన్నారు. జిల్లా కలెక్టర్‌ బుధవారం మధ్యాహ్నం చిత్తూరు నగరపాలక పరిధిలోని 75. దొడ్డిపల్లి వార్డు సచివాలయంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ వివిధ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులు, అనర్హుల జాబితాలను పరిశీలించారు. అదేవిధంగా మొత్తం వార్డు పరిధిలో ఎన్ని గహాలు ఉన్నాయని ఇంకా ఎంతమందికి ఇళ్ల స్థలాలు గహాలు అవసరం అని అడిగారు. ప్రభుత్వ సంక్షేమ అభివద్ధి పథకాలకు సంబంధించిన అర్హుదారుల జాబితాలను వారు చూసుకునే విధంగా ముందు వైపు ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ తో పాటు నగరపాలిక కమిషనర్‌ అరుణ, కార్పొరేటర్‌ సునీత శివకుమార్‌ పాల్గొన్నారు.
గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలి
చిత్తూరుఅర్బన్‌ :
రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని వారందరికీ గహ వసతిని కల్పించాలని భారీ ఎత్తున గహ నిర్మాణం చేపట్టడం జరిగిందని, పనులను వేగవంతంగా చేయించాలని, కాలనీలలో మౌలిక వసతులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం. హరి నారాయణన్‌ అన్నారు. జిల్లా కలెక్టర్‌ బుధవారం చిత్తూరు నగరపాలక పరిధిలోని 75. దొడ్డిపల్లి సమీపంలో నిర్మాణంలో ఉన్న కాలనీని సందర్శించారు. మొత్తం 495 గహ నిర్మాణాలు మంజూరు అయ్యాయని ఇందులో 488 గ్రౌండింగ్‌ అయ్యాయని, ఏడుగురు ఇంకా ప్రారంభించలేదని, 249 గహ నిర్మాణాలు బేస్మెంట్‌ స్థాయిని దాటాయని, మిగతా గహ నిర్మాణాలు వివిధ స్థాయిలలో పనులు జరుగుతున్నాయని, ఇప్పటివరకు లబ్ధిదారులకు రెండు కోట్లకు పైగా చెల్లింపులు చేయడం జరిగిందని హౌసింగ్‌ ఏఈ శ్రీధర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ అరుణ, కార్పొరేటర్‌ సునీత శివకుమార్‌, తాసిల్దార్‌ పార్వతి ,ఏఈ శ్రీధర్‌, మెప్మా అధికారి గోపి తదితరులు ఉన్నారు.