నాడు -నేడుతో విద్యకు మహర్దశ: జెడ్పీ చైర్మన్
ప్రజాశక్తి- వికోట: జిల్లా వ్యాప్తంగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న నాడు- నేడు పనుల ద్వారా విద్యకు మహర్దశ రానున్నదని చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. మండల పరిధిలోని నడిపేపల్లి ఉర్దూ ఉన్నత పాఠశాలకు మంజూరైన నాడు- నేడు పనులలో భాగంగా నూతన భవనాలకు వారు భూమిపూజ నిర్వహించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్య, వైద్యం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా నాడూ- నేడూ పథకం కింద మారుమూల ప్రాంతాల్లో సైతం పాఠశాలల రూపురేఖలు మారుతాయని తెలిపారు. కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడుల్లో సైతం మెరుగైన విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తూ విద్యా కానుకలు అమ్మఒడి తదితర పథకాలతో తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ విద్యార్థుల చదువుకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. గ్రామస్థాయిలో సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందేలా చూడాలన్నారు. వాలంటరీ వ్యవస్థ అర్హులైన ప్రతి నిరుపేదకు ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందేందుకు దోహదపడుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ దామోదర్, వైస్‌ఎంపీపీ లక్ష్మణ్‌రెడ్డి, ఉపసర్పంచ్ శ్రీదేవి, కన్వీనర్ రాధాకష్ణారెడ్డి, ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివద్ధి కమిటీ చైర్మన్ అమర్నాథ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.










