నాడు- నేడు పనులు త్వరగా పూర్తిచేయాలి : జెడ్‌పి ఛైర్మన్
ప్రజాశక్తి- వికోట: మండల పరిధిలో జరుగుతున్న నాడు-నేడు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు అధికారాలను ఆదేశించారు. మండల కేంద్రమైన వికోటలో బుధవారం నాడు-నేడు పనుల పురోగతిపై అధికారులు ప్రజాప్రతినిధులతో వారు సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలానికి మంజూరైన పనులు వాటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న పనులలో నాణ్యతాప్రమాణాలు పాటించాలని, త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు సంయుక్తంగా కషి చేయాలన్నారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ప్రత్యేకశ్రద్ధతో రాష్ట్రంలో అభివద్ధి సంక్షేమ పథకాల రథసారథిగా నిలిచారని కొనియాడారు. విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారని కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ బడులను బలోపేతం చేసి విలువలతో కూడిన విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు. దీనికి అనుగుణంగా అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు నాడు-నేడు పనులను త్వరితగతిన పూర్తిచేసి భవనాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కషి చేయాలన్నారు. ఎక్కడైనా సమస్యలుంటే తమ దష్టికి తీసుకొస్తే జిల్లా పరిషత్ చైర్మెన్ పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడల సహకారంతో సత్వరమే పరిష్కరిస్తామని ఎంపీపీ యువరాజ్ సూచించారు జిల్లాపరిషత్ ప్రత్యేక ఆహ్వానితులు గౌస్, వైస్‌ఎంపీపీ తమీంఖాన్ గోనుమాకులపల్లె సింగిల్విండో అధ్యక్షులు దవణంభక్త, ఎంపీడీఓ బాలాజీ, ఎంఈఓ చంద్రశేఖర్, మండల వ్యవసాయ అభివద్ధి కమిటీ చైర్మన్ సుబ్రమణ్యంరెడ్డి, ప్రభుత్వ జూనియర్ కళాశాల కమిటీ అధ్యక్షులు అమర్నాథ్‌తోపాటు సర్పంచులు, ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.










