నాడు-నేడు పనులు పరిశీలన
ప్రజాశక్తి-ఉదయగిరి : మండల పరిధిలోని జిల్లా ఉన్నత పాఠశాల, వెంగళరావు నగర్ ఎపిఆర్‌ఎస్ గండిపాలెం పాఠశాలల్లో జరుగుతన్న నాడు-నేడు పనులు, మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం ఎంఇఒ-1 షేక్ మస్తాన్ వలీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఉన్నత పాఠశాల వెంగళరావు నగర్‌లో జగనన్న మనబడి నాడు- నేడు పనులను పరిశీలించి నాణ్యమైన వస్తువులను వాడుతూ నాణ్యతతో త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. ప్రతి కాంక్రీట్ పనికి ప్లాస్టింగ్స్‌కు ఉదయం సాయంత్రం వాటర్‌తో క్యూరింగ్ చేయాలని ప్రతి పనికి తీర్మానాలను తీర్మాన రిజిస్టర్‌లో నమోదు చేసి కమిటీ సభ్యులతో సంతకాలు చేయించాలని ప్రధానోపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తూ విద్యార్థులను తమ సొంత పిల్లలుగా భావించి మన ఇంటి వద్ద ఎంత రుచిశుచి కరంగా భోజనం తయారు చేయాలని సూచించారు. ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం తయారు చేయాలన్నారు.










