నాడు-నేడు పనులు పరిశీలన
ప్రజాశక్తి-ఉదయగిరి : జగనన్న మనబడి నాడు-నేడు పనులను ఎంఇఒ-2 తోట శ్రీనివాసులు పరిశీలన చేశారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బిసి కాలనీ తెలుగు పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరుగుతున్న జగనన్న మనబడి నాడు-నేడు పనులను పరిశీలిస్తూ నాణ్యమైన వస్తువులను వాడుతూ నాణ్యతగా త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. ప్రతి కాంక్రీట్ పనికి ఉదయం, సాయంత్రం పూట వాటర్‌తో క్యూరింగ్ చేయాలని పలు సూచనలు చేశారు. హ్యాండ్ వాష్ పాయింట్స్‌కు నాణ్యమైన స్టీల్ ట్యాప్‌లను వాడాలని పూర్తయిన ప్రతి పనిని ఎస్‌టిఎమ్‌ఎస్ యాప్‌లో నమోదు చేసి పూర్తి దశలో ఉన్న మీ పాఠశాలకు అవసరమగు నిధులు వచ్చే విధంగా కృషి చేస్తానని ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు తెలిపారు. అనంతరం 5వ తరగతి విద్యార్థుల అభ్యసన పఠన సామర్థ్య నైపుణ్యాలను పరిశీలిస్తూ విద్యార్థుల వారి తరగతి స్థాయికి తగ్గట్టుగా ఉన్నవని ముఖ్యంగా గుణకారంలో జనరల్ నాలెడ్జీలో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని మరికొన్ని సూచనలు చేశారు.










