ప్రజాశక్తి - మొగల్తూరు
నాడు-నేడులో చేపట్టిన పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణాలను త్వరతగతిన పూర్తి చేయాలని మండల ప్రత్యేకాధికారి వి.విజయలక్ష్మి ఆదేశించారు. శనివారం హౌసింగ్ డే సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్ అసిస్టెంట్లు సమావేశంలో ఆమె మాట్లాడారు. నాడు-నేడు ఫేజ్-2లో 46 పాఠశాలలు, పది అంగన్‌వాడీ కేంద్రాలను రూ.17.85 కోట్లతో, అభివృద్ధి పరుస్తున్నామన్నారు. అనంతరం మొగల్తూరు పంచాయతీ పడమటిపాలెం, కొత్తపాలెం గ్రామాల్లో చేపట్టిన పాఠశాల అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. ఆమెతో పాటు ఎంపిడిఒ ఉండ్రు బాబ్జిరాజు, పిఆర్‌ఎస్‌ఇ అశోక్, హౌసింగ్ ఎఇ ఫణీంద్ర ఉన్నారు.










