Oct 29,2022 21:27

నాడు- నేడు పనుల్లో నాణ్యత పాటించాలి
జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు
ప్రజాశక్తి- వికోట:
మండలంలో జరుగుతున్న నాడు-నేడు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని చిత్తూరు జిల్లాపరిషత్‌ ఛైర్మన్‌ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. మండలంలోని జౌనిపల్లి గ్రామపంచాయతీ, నక్కనపల్లి జడ్పీ హైస్కూల్‌లో జరుగుతున్న నాడు- నేడు పనులను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణంనకు, మరమ్మతులకు వాడుతున్న మెటీరియల్స్‌ను తనిఖీ చేసి సంతప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన పనులను పూర్తిచేసి, భవనాలను విద్యార్థుల సౌకర్యార్థం అందుబాటులోకి తేవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మండల పరిధిలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న నాడు-నేడు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, స్థానిక నేతలు, ప్రజలు పాల్గొన్నారు.