ప్రజాశక్తి నెల్లూరు అర్బన్ :జనసేన పిఎసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను విమర్శించే స్థాయి కేతంరెడ్డి వినోద్‌కుమార్‌కు లేదని జనసేన నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజరుబాబు పేర్కొన్నారు. సోమవారం నగరంలోని జనసేన జిల్లా కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు వైసిపి ఎంఎల్‌ఎలు పార్టీ మారితే ఆ పార్టీ ఏమిచేయలేకపోయిందని, జనసేన నుంచి ఒక చోటా నాయకుడు వైసిపిలో చేరితే సంబరపడిపోతున్నారని, అంటే జిల్లా వైసిపి స్థాయి తగ్గిందా .. కేతంరెడ్డి స్థాయి పెరిగిందో అర్థం కావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. స్వప్రయోజనాల కోసమే కేతంరెడ్డి జనసేన పార్టీని వాడుకున్నారని, ఆయన పార్టీకి ఒక్క శాతం కూడా ఉపయోగపడలేదన్నారు. పార్టీకి ఉపయోగపడి ఉండి ఉంటే ఈరోజు పార్టీలో పెద్ద స్థాయిలో ఉండేవారన్నారు. దేశంలో కార్యకర్తలకు అండగా ఉండే పార్టీ జనసేన మాత్రమేననన్నారు. తమ పార్టీలో ఉన్న కలుపు మొక్కలన్నింటనీ ఏరివేస్తూ వస్తున్నామన్నారు. పార్టీలు మారుతున్న నైజం కేతంరెడ్డి వినోద్‌రెడ్డికే చెల్లుతుందన్నారు. నాదెండ్ల మనోహర్ గురించి మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ కోసం రేయింబవళ్లు పనిచేస్తున్న వ్యక్తి నాదెండ్ల మనోహర్ అన్నారు. నెల్లూరు నగరంలో జనసేన పార్టీ బలంగా ఉందన్నారు. ఆరు నెలల కిందటే జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్‌రెడ్డి కేతంరెడ్డిని సస్పెండ్ చేశారని, అధిష్టానం కాళ్లు పట్టుకుని సస్పెన్షన్ ఎత్తివేయించుకున్నారన్నారు. నెల్లూరు నగర ఎంఎల్‌ఎలతో కలిసి పనిచేయగలవా అని సవాల్ విసిరారు. వైసిపికిలో నెల్లూరు జిల్లాలో నూకలు చెల్లిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు..










