Oct 16,2023 19:58

మాట్లాడుతున్న కేతంరెడ్డి

మాట్లాడుతున్న కేతంరెడ్డి
నాదెండ్ల మనోహర్‌ జనసేన పార్టీకి చీడపురుగు
ప్రజాశక్తి-నెల్లూరు అర్బన్‌:నాదెండ్ల మనోహర్‌ జనసేన పార్టీకి చీడపురుగులాంటివారని కేతం రెడ్డి వినోద్‌ రెడ్డి అన్నారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ లో చేరినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి ఆహ్వానం మేరకు పార్టీలో చేరానన్నారు. పార్టీలో చేరిక సందర్భంగా తమ ఆశీస్సులు అందించిన ఎంపిలు విజయసాయి రెడ్డి, మద్దెల గురుమూర్తి, మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి నాదెండ్ల మనోహర్‌ వల్ల ఆ పార్టీకి తీవ్ర డ్యామేజ్‌ జరుగుతుందన్నారు. వైసీపీ తీర్థం పుచ్చుకున్న వినోద్‌ రెడ్డి ఆదివారం మీడియా ముందుకు వచ్చారు స్థానిక మాగుంట లేఔట్‌ నందు గల వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ పవన్‌ కళ్యాణ్‌ చేతిలో లేదని ఆ పార్టీలో నెంబర్‌ టూ గా చలామణి అవుతున్న నాదెండ్ల మనోహర్‌ కనుసన్నాల్లో నడుస్తుందన్నారు. వైసీపీ తరఫున జిల్లాలో ఎమ్మెల్యేగా నిలబడే వారి అందరిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు సాయి శక్తుల కషి చేస్తామని తెలిపారు.