Oct 09,2023 20:55

ఫొటో : ఆర్‌.డి.ఒ. వికె శీనా నాయక్‌కు వినతి పత్రం అందజేస్తున్న వికలాంగుడు నాగి వెంకటేశ్వర్లు

నా పొలం ఇప్పించండి సారూ..
ప్రజాశక్తి-కావలి : తన భూమిని కాసు మహేశ్వరరావు అనే వ్యక్తి అక్రమంగా ఆక్రమించుకున్నాడని, తనకు న్యాయం చేసి, తన భూమిని తనకు ఇప్పించాలని నాగి వెంకటేశ్వర్లు అనే వికలాంగుడు ఆర్‌.డి.ఒ.ను కోరాడు. సోమవారం గ్రీవెన్స్‌ డే సందర్బంగా స్థానిక ఆర్‌డిఒ వి.కె. శీనా నాయక్‌కు బాధితుడు వైసిపి వికలాంగుల సంఘం నాయకులతో కలిసి వచ్చి వినతిపత్రం అందజేశాడు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కావలి డివిజన్‌ జలదంకి మండలం కేశవరం పంచాయతీ తిమ్మసముద్రం గ్రామ సర్వే నెంబర్‌ 656-2లో యకరా4-32సెంట్లు భూమి తమ తండ్రి నాగి సుబ్బారాయుడుకు ప్రభుత్వం అసైన్డ్‌మెంట్‌ పట్టా ఇచ్చిందని, అయన తదనంతరం తనకు, తన అన్నకు చెరో యకరా2-16సెంట్లు చొప్పున పంచుకుని సాగు చేసుకుంటున్నామని తెలిపారు.
తనకు చెందిన భూమిని అదే గ్రామానికి చెందిన కాసు పద్మావతి అనే పేరుపై ఆమె భర్త కాసు.మహేశ్వరరావు అక్రమంగా ఆక్రమించుకున్నాడని బాధితుడు, వికలాంగుడు నాగి వెంకటేశ్వర్లు ఆరోపించారు. తహశీల్దారు, ఆర్‌ఐలు తనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తనకు న్యాయం జరిపించి, తన భూమిని తనకు ఇప్పించాలని ఆర్‌.డి.ఒ.ను కోరాడు. ఈ సందర్భంగా ఆర్‌.డి.ఒ. స్పందించి, జలదంకి తహశీల్దారుకు ఫోన్‌ చేసి, బాధితుడికి న్యాయం చేయాలని ఆదేశించారు. బాధితుడివెంట వికలాంగుల సంఘం నాయకులు పోసిన వెంకట్రావు, డివిజన్‌లోని వికలాంగులు పాల్గొన్నారు.