అత్తగారింటి ముందు ధర్నా
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్ :
గురువారం మదనపల్లె మండలం పోతబోలు పంచాయతీ దిగువగాండ్లపల్లెలోని భర్త ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడు రోజుల క్రిం బయటికి వెళ్ళిన రమేష్‌కుమార్ తిరిగి రాలేదన్నారు. మాతాలు వేరు కావడంలోనే తన అత్తింటి వారు నా భర్త రమేష్ కుమార్‌ను దాచారని, నా భర్తను వెంటనే అప్పజేప్పాలని వేడుకుంది. మా అత్తింటివారిని అడిగితే తమకు తెలియదని చెబుతుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. మతాంతర వివాహం చేసుకున్నందుకు అత్తగారింట్లో తనను గహహింస పెట్టారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. రమేష్ కుమార్ కుటుంబ సభ్యులు, కొంత మంది రమేష్ కుమార్‌ను వదిలేసి వెళ్లిపోవాలని బెదిరిచడంతో పాటు కొట్టారని తాను వెళ్లనని పట్టుపట్టడంతో వదిలేశారన్నారు. అయితే ఆమె అత్తింటివారు సనా కుటుంబ సభ్యులే రమేష్ ను ఏమో చేశారని, సనా ఇప్పుడు నాటకం ఆడుతోందని ఆరోపించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.










