ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రమైన నార్పలలో శనివారం ఆదివారం స్థానిక ఈద్గా మైదానంలో జిల్లాలోని ముస్లిం సోదరుల జోడు (కలయిక) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా సుమారు 1000 మంది వరకు తరలివచ్చారు శనివారం సాయంత్రం నుండి ఆదివారం మధ్యాహ్నం వరకు బోధనలు జరిగాయి. కార్యక్రమానికి బెంగళూరు నుండి మౌలానా షామీర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి దైవస్మరనే మోక్షమార్గం అని తెలిపారు. స్థానిక షాదీఖానాలో కలయికకు వచ్చిన ముస్లిం సోదరులందరికీ భోజన ఏర్పాట్లు చేశారు జిల్లా బాధ్యులు అమీర్ భాష మాట్లాడుతూ ప్రతి ఏడాది జిల్లాలోని ఏదో ఒక మండలంలో జిల్లా ముస్లింల జోడు కలయికను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ ఏడాది నార్పల మండలం ఎంపిక చేసినట్లు తెలిపారు. మద్రాస ప్రారంభం మండల కేంద్రంలోని స్థానిక ఈద్గా మసీదు పక్కన నూతనంగా నిర్మించిన మద్రాసాను స్థానిక ముస్లిం మత మత పెద్దలతో పాటు జిల్లా మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్ భాష నార్పల సత్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ మండల కేంద్రంలోని ముస్లిం సోదరులు ఈ మద్రాసాని సద్వినియోగం చేసుకొని వారి వారి పిల్లలను బాధ్యతగా మదరసాకు పంపాలని కోరారు.










