ప్రజాశక్తి-వి కోట : మండలం పరిధిలోని పట్రపల్లెలో రాజశేఖర్ నాయక్ ను అతని భార్య రాణెమ్మ మరో వ్యక్తితో కలసి హతమార్చిన ఘటనను పోలీసులు ఛేదించారు. డీఎస్పీ గంగయ్య కథనం మేరకు వివరాలు పట్ల పల్లికి చెందిన రాణిమ్మ భర్త వేదింపులు భరించలేక ప్రియుడితో కలసి భర్తకు మద్యం తాగించి ఇంట్లో పడుకోబెట్టి గొంతుకు తాడుతో ఉరి బిగించి చంపేశారు. ఆపై అనుమానాస్పద మృతిగా చిత్రీకరించారు. అతని మృతి పై తమకు అనుమానం ఉందని అన్న మురళీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వారిదైన శైలిలో విచారణ చేసి వాస్తవాలను బహిర్గతం చేశారు. రామకుప్పం మండలం గుట్టూరు తాండాకు చెందిన నాదానాయక్ కుమారై రాణిమ్మతో 13 ఏళ్ళ క్రితం పట్రపల్లెకు చెందిన నాగరాజు కుమారుడు రాజశేఖర్ నాయక్ తో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు కుమారులు. గత కొంత కాలంగా భర్త తాగుడుకు బానిసై మార్కెట్లో కూలీగా పని చేసే భార్య ప్రవర్తన మీద అనుమానంతో వేధించేవాడు. ఈ నేఫత్యంలో రాణిమ్మ భర్తను ఎలాగైనా అఢ్డుతొలగించుకోవాలని పథకం ప్రకారం హత్యకు పాల్పడింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అతనిది హత్యేనని నిర్ధారణ కావడంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. పోలీసులు భార్య రాణిమ్మ.. మరో వ్యక్తి నవీన్ నాయక్ లను అదుపులోనికి తీసుకుని విచారించగా హత్య విషయం బయట పడింది. భార్య రాణిమ్మ వాళ్ళ సమీప బంధువు నవీన్ నాయక్ తో కలసి పథకం ప్రకారం భర్త రాజశేఖర్ నాయక్ ను 2022 ఆగస్తు 8న ఉదయం 10 గంటల సమయంలోఇంట్లో గొంతుకు తాడుతో ఉరి బిగించి చంపేసి.. గొంతుపై గాయం కనబడకుండా చికిత్స చేశారు. ఆపై ఎవరికీ తెలియ కుండా ఆక్కడి నుండీ జారుకున్నారు. మురళీ ఫిర్యాదుతో తీగలాగితే డొంక కదిలినట్లు హత్య కేసు మిష్టరీని పోలిసులు ఛేదించారు. పలమనేరు డిఎస్పీ గంగయ్య నేతృత్వంలో వి.కోట సిఐ ప్రసాద్ బాబు.. ఎస్సై రాంభూపాల్ సిబ్బందితో కలసి నిందితులను సోమవారం అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.










