Mar 17,2023 16:08

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సిఐటియూ అనుబంధ రాష్ట్ర మున్సిపల్ యూనియన్ పిలుపులో భాగంగా శుక్రవారం ఉదయం అనంతపురం నగరంలోని మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ (ఆర్.డి) ఆఫీస్ వద్ద మున్సిపల్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ATM.నాగరాజు అధ్యక్షతన  ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు K.నాగభూషణం, రాష్ట్ర కమిటీ సభ్యులు M.లక్ష్మీనరసమ్మ, మంత్రి వరలక్ష్మి , జిల్లా కోశాధికారి బత్తల. ఆదినారాయణ , సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రాజమోహన్, నగర ఓల్డ్ టౌన్ ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ, అధ్యక్షులు గురురాజా , నగర అధ్యక్ష కార్యదర్శులు బండారు. ఎర్రి స్వామి, సాకే. తిరుమలేశు, ఇంజనీరింగ్ కమిటీ సభ్యులు లోకేష్ మరియు తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం,అధ్యక్ష కార్యదర్శులు అంజి,
ఓన్నూరప్ప,క్రిష్ట,శామ్యూల్, రాము, మల్లికార్జున, గుత్తి ఇంజనీరింగ్ కమిటీ సభ్యులు, తదితర కమిటీ సభ్యులు హాజరైనారు.  సిఐటియు నాయకులు మాట్లాడుతూ రెగ్యులర్ కార్మికులకు సిపిఎస్ రద్దు, జిపిఎఫ్ అకౌంట్స్ తెరవాలని,హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు రెండు సంవత్సరాలుగా బకాయి ఉన్న సరెండర్ లీవ్ అమౌంట్ ఇవ్వాలని, డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్& సెమిస్కిల్డ్ వేతనాలతో పాటు హెల్త్ & రిస్క్ అలవెన్స్  ఇవ్వాలని, డిమాండ్ చేశారు. 60 సంవత్సరాల పేరుతో తొలగించిన ఇంజనీరింగ్ కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని కోరారు. మలేరియా, కోవిడ్, గార్బేజ్ కార్మికులను అవుట్సోర్సింగ్ కార్మికులుగా గుర్తించి ఆప్కాస్ లో చేర్చి ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్ఎంఆర్ కార్మికులకు టైం స్కేలు, కరువు భత్యం, డి, ఎ, ఐ. ఆర్ లతోపాటు హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని కోరారు. క్లాప్ ఆటో డ్రైవర్లకు కనీస వేతనం అమలు చేయాలని అన్నారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ లలో ఉన్న తప్పులను సవరించి కార్మికులందరికీ ఈఎస్ఐ కార్డ్ ఇచ్చి ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. అదేవిధంగా ఇదివరకే చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఈ ఎస్ఐ, ఈపీఎఫ్ నుండి వచ్చే డెత్ బెనిఫిట్స్ అందేలా చూడాలని కోరారు. అనారోగ్య మరియు ప్రమాదవశాత్తు చనిపోయిన  కార్మికుల కుటుంబ సభ్యులలో ఒకరికి ఉపాధి కల్పించాలని, పెరిగిన నగర విస్తీర్ణం మరియు జనాభాకి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని, పనిముట్లు, రక్షణ పరికరాలు సకాలంలో అందజేయాలని, మున్సిపల్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు అయ్యేలా చూడాలని, ఉన్నతాధికారులను, పాలకవర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు . అనంతరం రీజినల్ డైరెక్టర్ (ఆర్.డి) పివివి ఎస్ మూర్తి కి వినతిపత్రం అందజేయడం జరిగింది. సమస్యలు పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో ఆందోళన పోరాటాలు ఉదృతం చేస్తామని తెలియజేయడం జరిగింది. ఆర్. డి మూర్తి స్పందించి సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శేషేంద్ర కుమార్, కమిటీ సభ్యులు రాఘవేంద్ర ప్రసాద్, మాజీ కార్యదర్శి లక్ష్మీనారాయణ, నాగేంద్ర, చలపతి, నల్లప్ప,గీతమ్మ, నాగలింగం, M. ఆదినారాయణ నారాయణస్వామి, జయరాం, ఇమాంబి, నాగేంద్ర, రవి, నారాయణ, శివ, ప్రభాకర్, మిత్ర సంఘాల నాయకులు వెంకటేష్,సర్దానమ్మ, ఇంజనీరింగ్ మరియు తదితర మున్సిపాలిటీల కమిటీ సభ్యులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.