Oct 20,2022 13:53
  • వాస్తవాలు తెరుస్తాం అంటున్న తాసిల్దార్ 

ప్రజాశక్తి-వెదురు కుప్పం (చిత్తూరు జిల్లా) : మండలంలోని బ్రాహ్మణపల్లెలో ప్రభుత్వ భూములను, అక్రమదారుల నుంచి కాపాడాలని " ప్రొటెక్ట్ బ్రాహ్మణపల్లె" అనే జీ మెయిల్ నుంచి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి .ఈనెల 4వ తేదీన వెదురు కుప్పం తాసిల్దార్ తో సహా ,జిల్లా అధికారులకు ఈమెయిల్ లో అందాయి. ఇందులో సారాంశం ఇలా ఉంది.. మాది బ్రాహ్మణపల్లె గ్రామం బ్రాహ్మణపల్లి రెవిన్యూ లేఖ దాఖలాలో సర్వేనెంబర్ 15 లో సుమారుగా 27 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కురివికుప్పం రెవిన్యూ లెక్క దాఖలాలో 13 సర్వే నెంబర్లలో సుమారుగా 35 ఎకరాల ప్రభుత్వ భూమి ,పశువుల మేత, కుంట పరంబోకు ,కాలవ పరంబోకి ఉంది .దీనిని  అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించుకున్నాడు. ఈ ప్రాంతంలో సెటిల్మెంట్ భూమి సుమారుగా 20 లక్షల నుంచి 30 లక్షల వరకు ధర పలుకుతుంది. దీంతో అవకాశం ఉన్న వారంతా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటున్నారు. అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గ్రామస్తులు అంటున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ ఈమెయిల్లో పేర్కొన్నారు. మా గ్రామానికి పశువుల మేత లేకుండా చేస్తున్నారని వారు పేర్కొన్నారు.

మెయిల్ వచ్చిన మాట వాస్తవమే, వాస్తవాలు తేలుస్తాం : తాసిల్దార్ పుల్లారెడ్డి
దీనిపై గురువారం ప్రజాశక్తి వివరణ కోరగా తాసిల్దార్ చెప్పిన మాటలు... మెయిల్ వచ్చిన మాట వాస్తవమేనని అన్నారు మొత్తం 28 సర్వే నెంబర్లు మెయిల్ ద్వారా పంపించడం జరిగింది.దీనిపై సర్వే జరిపి నివేదిక ఇవ్వాలని వీఆర్వో కు ,  సర్వేర్ లకు ఆదేశాలు ఇచ్చాము. . ఎక్కడైనా ప్రభుత్వ భూమి అక్రమాలకు గురి అయి ఉంటే స్వాధీనం చేసుకొని, రెడ్ మార్క్ చేస్తామని చెప్పారు. రీ సర్వేలో అన్ని వివరాలు సమగ్రంగా తేలుతాయని అన్నారు .ఫిర్యాదు చేసింది ఎవరో తెలియడం లేదని చెప్పారు.