ప్రజాశక్తి - పెనుమంట్ర : దివ్యాంగులు, చెవిటి, మూగ లైనటువంటి వారికి ఎంపీపీ సహకారంతో బస్సు , రైల్వే పాసులు ఇస్తున్నట్లు ఎంపీడీఓ వి పూర్ణ బాబ్జి అన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో వికలాంగులకు ఎంపీపీ కర్రి వెంకటనారాయణ రెడ్డి (వాసు రెడ్డి) 50 శాతం రాయితీతో బస్సు , రైల్వే పాసుల దరఖాస్తులను రవాణా శాఖ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా పూర్ణ బాబ్జి మాట్లాడుతూ మండలంలో ప్రతి సచివాలయం పరిధిలోని ఉన్న చెవిటి, మూగ, దివ్యాంగులకు మూడు సంవత్సరాలు కాల పరిమితితో పాసులు అందించడం జరుగుతుందన్నారు. బస్సుకు రూ 100 , రైల్వేకు రూ 200 చొప్పున దరఖాస్తుకు చెల్లించాల్సి ఉందన్నారు. కానీ మండలం పరిధిలో అన్న దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరికి ఎంపీపీ కర్రి వెంకటనారాయణ రెడ్డి (వాసురెడ్డి) సహకారంతో వాసు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ పాసులు పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, అల్ట్రాటెక్ వంటి వాటికి ఉపయోగపడుతుందని చెప్పారు. మీ పాసులను పొందేందుకు ప్రతి సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ లు ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు సిహెచ్సీ కేజిసిఎస్ రెడ్డి , ప్రోగ్రాం ఆఫీసర్ కె వెంకటాద్రి , రాజోలు ఆర్టీసీ ఎన్ సత్తిబాబు , వెల్ఫేర్ అసిస్టెంట్ లు పాల్గొన్నారు.










