ప్రజాశక్తి-గణపవరం : ఇంటి పరిసరాల్లో పరిశుభ్రత లేకపోతే దోమలు చేరుతాయని దోమలు కుట్టడం వలన అంటురోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వీరేశ్వరపురం గ్రామ సర్పంచ్ అడబాల రవిశంకర్ అన్నారు. బుధవారం గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో స్థానికులకు పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవిశంకర్ మాట్లాడుతూ ఇంటి పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారాలు లేకుండా చూసుకోవాలని అన్నారు. ఇంటి ప్రదేశంలో పనికిరాని టైర్లు పూల కుండీలు నీరు లేకుండా చూసుకోవాలని అన్నారు. అనంతరం స్థానిక సచివాలయం వద్ద 60 సంవత్సరాలు నిండిన వృద్ధులకు కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా 61 మంది వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు. 61 మందికి కళ్ళజోళ్ళు పడతాయని కంటి డాక్టర్ ఐ శ్రీనివాస్ చెప్పారు. కళ్ళజోళ్ళు ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గణపవరం ఆరోగ్య కేంద్రం డాక్టర్లు పి సంతోష్ నాయుడు పి కిరణ్మయి సిహెచ్ఓ జాలాదివిల్సన్ బాబు. టి రుతికుమారి శ్రీరామ మణీ.జీ.సూర్యకుమారి పాల్గొన్నారు.










