- వ్యక్తికి తీవ్ర రక్తస్రావం
ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక గుగూడు రోడ్డులో స్థానిక స్టేట్ బ్యాంక్ సమీపంలో ఓ వ్యక్తిపై అకస్మాత్తుగా కోతి దాడి చేసి కాలిని కొరికి తీవ్రంగా గాయం చేసింది. వివరాల్లోకి వెళ్తే గుంతకల్లు మండలం నక్కల దొడ్డి తాండాకు చెందిన కుల్లాయి నాయక్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో కుల్లాయి స్వామి దర్శనానికి గూగుడుకు వెళ్తూ నార్పలలో ఆటో నిలబెట్టి టెంకాయలు, పూలు కొని ఆటోలోకి తీసుకొని వెళ్తుండగా ఒక్కసారిగా వెంకటేష్ నాయక్ పైకి కోతి దూకి అతని కుడికాలు కొరకగా తీవ్రమైన రక్తస్రావం కావడంతో వెంటనే నార్పల ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. డాక్టర్ ప్రవీణ్ గాయాన్ని శుభ్రం చేసి ఇంజక్షన్లు వేసి కుట్లు వేశారు. మండల కేంద్రమైన నార్పల్లో ఇటీవల కాలంలో కోతులు, పందుల బెడద అధికమైందని కోతుల దెబ్బకు చిన్నారులు పిల్లలు బయటికి రావడానికి సైతం భయపడుతున్నారు. గత కొద్ది రోజుల క్రితం స్థానిక కోటవీధిలో ఓ చిన్నారి మర్మావయాన్ని పంది దాడి చేసి కొరకడం ఎప్పుడు నడిరోడ్డులో కోతి దాడి చేయడం చూస్తే నార్పలలో పందులు కోతుల ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి నార్పల ప్రజలకు పందులు, కోతుల దాడుల నుంచి కాపాడాలని కోరుతున్నారు.










