Sep 11,2022 16:13

ప్రజాశక్తి-యాదమరి : ప్రముఖ పారిశ్రామికవేత్త, బిఎంఆర్ సంస్థల అధినేత మీ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. యాదమరి మండలం చెందిన బిఎంఆర్ గ్రూపు సంస్థల అధినేత చిత్తూరు ఆయన స్వగృహంలో పలువురు అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. యాదమరి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు సురేష్ బాబు పుష్పగుచ్చం అందించి దుస్సాలువతో సత్కరించినారు.  అనంతరం వైఎస్ఆర్సిపి అభిమానులు, కార్యకర్తలు, స్నేహితులు  ఆయన స్వగృహంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.