Nov 03,2022 12:42

ప్రజాశక్తి-బంగారుపాళ్యం : అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని పూతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్ బాబు అన్నారు గురువారం మండల కేంద్రంలోని బంగారుపాలె పంచాయతీ ఇందిరమ్మ కాలనీలో మురికి కాలువ నిర్మాణానికి జడ్పిటిసి సోమశేఖర్ ఆధ్వర్యంలో భూమి పూజ చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు మాట్లాడుతూ జడ్పీ నిధులతో మూడు లక్షల రూపాయలతో తాగునీరు మురికి కాలువ పైప్ లైన్లకు పనులు చేపడుతున్నట్టు గతంలో సిసి రోడ్డు నిర్మాణం చేపట్టామని గ్రామాల మౌలిక వసతులు కల్పించడమే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ అమరావతి  జడ్పీ మాజీ చైర్మన్ కుమార్ రాజా వైస్ ఎంపీపీ శిరీష్ రెడ్డి సింగల్ విండో చైర్మన్ దత్తు రెడ్డి ఎంపీడీవో శ్రీధర్  ఏఈ శ్రీధర్ నాయకులు కృష్ణమూర్తి ,శరత్ రెడ్డి ,సర్దార్ ,కిషోర్ కుమార్ రెడ్డి పలువురు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు