Jan 02,2023 15:47

ప్రజాశక్తి-వీకోట : రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైయస్సార్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నారని పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ్ తెలిపారు. మండల కేంద్రమైన వీకోటలోని స్త్రీ  శక్తి భవనంలో సోమవారం మండలానికి సంబంధించి నూతనంగా మంజూరైన పెన్షన్లను జడ్పీ చైర్మన్  శ్రీనివాసులతో కలసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాదయాత్ర సందర్భంగా జగనన్న ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం విడతల వారి లబ్ధిదారులకు పింఛన్లను పెంచి అందిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా అర్హత ప్రామాణికంగా లబ్ధిదారులకు నూతన పెన్షన్లను ప్రభుత్వం అందిస్తోంది అన్నారు. ఈ సందర్భంగా మెగా చెక్కును ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం నూతనంగా ఎంపిక కాబడిన సచివాలయ కన్వీనర్లు,వాలంటీర్ల సమావేశంలో పాల్గొన్నారు. ప్రజల చెంతకు నేరుగా ప్రభుత్వాన్ని తీసుకొచ్చే కార్యక్రమానికి  తమ ప్రభుత్వం  శ్రీకారం చుట్టిందన్నారు. సచివాలయం కన్వీనర్లు, గృహసారథులు వాలంటీర్లకు పోటీకాదని. వాలంటీర్లకు అన్ని విధాలా రక్షణగా ఉండేవారన్నది గుర్తు పెట్టుకోవాలని సూచించారు.నాయకుడు అవసరం లేని సమాజాన్ని జగన్‌మోహన్‌రెడ్డి నిర్మించారని  ప్రతి 20 ఇళ్లలో ఒకరిని తీసుకొచ్చి నాయకత్వం అప్పగించారన్నారు. మన ప్రభుత్వం ఏం చేసింది, జగనన్న ఏం చేస్తున్నాడు, మన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడనే విషయాలను నిత్యం ప్రజలకు తెలియజేయాలని సభ్యులకు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీపీ యువరాజ్ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ బాలగురునాథ్ వైస్ ఎంపీపీలు తమీంఖాన్ లక్ష్మణ్ రెడ్డి  జిల్లాపరిషత్ సలహా మండలి సభ్యులు గౌస్ రాష్ట్ర వైకాపా ప్రధానకార్యదర్శి పి ఎన్ నాగరాజు మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ కుమార్ రెడ్డి  నేతలు గోపిరెడ్డి సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.