Mar 22,2023 16:28
  • ఉండి ఎమ్మెల్యే రామరాజు

ప్రజాశక్తి-పాలకోడేరు : ఆక్వా రైతులకు ఉపయోగపడే ఆక్వాత్పత్తులను తయారు చేయడం అని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. పాలకోడేరు గ్రామంలో గ్రామానికి చెందిన కొత్తపల్లి బలరామ కృష్ణంరాజు ఏర్పాటుచేసిన పరిశ్రమను  బుధవారం ఎమ్మెల్యే రామరాజు ప్రారంభించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పరిశ్రమను ఆక్వా రైతులు  వినియోగించుకోవాలని చెప్పారు. శృంగవృక్షం  బంటుమిల్లి గ్రామంలో పునః నిర్మించిన, శ్రీ కోదండ రామాలయం విగ్రహ ప్రతిష్ట సందర్భంగా నూతన ఆలయ పనులను ఎమ్మెల్యే రామరాజు పరిశీలించి, ఆలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించిన దాతలకు, ప్రజలకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే వెంటా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దెందుకూరి ఠాగూర్ కోటేశ్వరరాజు, క్రొవ్విడి దుర్గమ్మ, డి కృష్ణ, నడిపూడి వెంకట అప్పారావు, సాలా మల్లేశ్వరరావు పెనిమత్స వరప్రసాద్ రాజుగారు వీరవల్లి వెంకటరమణ, పాల శ్రీనివాసరావు  పాల సత్యనారాయణ  పాల్గొన్నారు.