Mar 29,2023 15:23

ప్రజాశక్తి-ఆత్మకూరు : అనంతపురం జిల్లా ప్రజలందరికీ, ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గం ప్రజలందరికీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా జరుపుకునే అచ్చమైన పండగ శ్రీరామనవమి అని రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగు వాకిలన్నీ పండగ శోభాయమానంతో కళకళలాడుతూ అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడేలా ఈ పండుగ అందరికీ శుభాలను చేకూర్చాలని పండగ సందర్భంగా బంధువులు,మిత్రులు, ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో,సంతోషంగా గడపాలని ముఖ్యంగా రైతులకు సకాలంలో వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండి ఆనందంగా ఉండాలని వారికి ఆర్థికంగా కలిసి రావాలని ఆకాంక్షించారు. లోకకళ్యాణం కోసం భగవంతుడు శ్రీరాముని రూపంలో మానవ జన్మ పొందారని, యావత్తు మానవాళికి శ్రీరాముని జీవితం ఆదర్శప్రాయమని ఆయన తల్లిదండ్రుల పట్ల,తమ్ముళ్ల పట్ల,భార్యపట్ల చూపించిన గౌరవము అభిమానము ప్రస్తుత కుటుంబ వ్యవస్థకు ఆదర్శనీయమని అంతేకాకుండా తన రాజ్యంలోని ప్రజల పట్ల తాను చూపిన ప్రేమాభిమానాలు రాజు అంటే రాముడిలా ఉండాలనే అంతగా పరిడవల్లిందని ఆయన ఆశీస్సులు యావత్తు మానవాళికి ఎల్లవేళలా తోడుండాలని ఆయన కోరుతూ ప్రతి ఒక్కరికి  శ్రీరామనవమి  పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.