Apr 14,2023 16:06

ప్రజాశక్తి-నార్పల  : ఈ నెల 17వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వసతి దీవెన పథకాన్ని ప్రారంభించడానికి నార్పలకు వస్తున్నారు ఈ సందర్భంగా స్థానిక క్రాసింగ్ లో బహిరంగ సభ వేదిక స్థానిక బాలుర పాఠశాల మైదానంలో హెలీపాడ్ను అధికారులు ఏర్పాటు చేశారు శుక్రవారం జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ బహిరంగ సభ నిర్వహించే వేదిక ఏర్పాటులను హెలిపాడ్ ను పరిశీలించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని అధికారులకు స్థానిక నాయకులకు సూచించారు వీరితోపాటు జిల్లా కలెక్టర్ గౌతమి జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ ఆర్డిఓ మధుసూదన్ మాజీ ఎమ్మెల్సీ శమంతకమణి వైసీపీ సీనియర్ నాయకులు నార్పల సత్యనారాయణ రెడ్డి, ఎంఈఎంఎస్ రాష్ట్ర డైరెక్టర్ రఘునాథరెడ్డి, ఎంపీపీ నాగేశ్వరరావు, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి మిద్దె కుల్లాయప్ప తాసిల్దార్ నారాయణస్వామి ఎంపీడీవో దివాకర్ వివిధ శాఖల జిల్లా స్థాయి మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు