May 10,2023 15:27

ప్రజాశక్తి-వి కోట : రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉపాధికి పెద్దపీట వేస్తున్నారని పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ తెలిపారు. మండలంలోని బైరుపల్లి సచివాలయం పరిధిలోని మాధకుప్పం, గోవిందపురం, యాదకుంట, తుపాకి చిన్నెపల్లి గ్రామాలలో బుధవారం జడ్పీ చైర్మన్ శ్రీనివాసులతో కలసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 'మీ గడప వద్దకే మీ ఎమ్మెల్యే' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 363 గృహాలను వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 4 లక్షల మంది  ఉండేవారని  వైయ‌స్ జగనన్న పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య ఆరు  లక్షలు దాటిందన్నారు. వీరికి తోడు మూడు లక్షలకు పైగా కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు అవకాశాలు ఇచ్చారాన్నారు. ఒక్క సచివాలయ వ్యవస్థ ద్వారానే సుమారు 1.30 లక్షల మందికి శాశ్విత ఉద్యోగాలు ఇచ్చారని. వైద్య ఆరోగ్య శాఖలో కొత్తగా 49 వేల మందికి ఉద్యోగాలు కల్పించారన్నారు. 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారని. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు. వీటితోపాటు వలసలను అరికట్టేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పనులు కల్పిస్తున్నామన్నారు. అర్హత ప్రమాదకంగా అర్హులైన ప్రతి ఒక్కరికి జగనన్న గృహాలు పింఛన్లు సచివాలయాల ద్వారా అందించడం జరుగుతుందని జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. ప్రజల నుండి అందిన పలు ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని సంబంధిత అధికారులను వారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యువరాజ్ ,వైస్ ఎంపీపీలు లక్ష్మణ్ రెడ్డి, తమీంఖాన్, పిఎసిఎస్ చైర్మన్ గోపిరెడ్డి, సర్పంచ్ నీలమ్మ ఎంపీటీసీ మురుగేష్ తోపాటు స్థానిక నేతలు ఇంద్రేష్,  శంకర్ రెడ్డి ,సుభాష్ ,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.