Apr 05,2023 11:16

ప్రజాశక్తి-నగరి(చిత్తూరు) : రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి రైతుల సంక్షేమం కోసమే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్.కే.రోజా  తెలిపారు. నగరి గ్రామీణ మండలం ఎం.కొత్తూరు గ్రామంలో 20లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్ర భవవాన్ని ప్రారంభించిన సందర్భంగా బుధవారం జరిగిన సమావేశంలో ఆమె ప్రసంగించారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి రైతులకు సరైన సూచనలు సహకారాలు అందించడానికి రైతు భరోసా కేంద్రాలు తోడ్పడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగరి ఎంపీడీవో, ఎమ్మార్వో, పి ఆర్ డి ఈ, ఏఈలు, ఎంపీపీ, ఎస్ ఎంపిపిలు, ఎంపిటిసిలు, సర్పంచ్లు, కమిటీ చైర్మన్లు, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.