- తేనెటీ విందు సేకరణ
ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : మూడవ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం రానున్నారు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి (రాజంపేట ఎంపీ లోక్ సభ క్యానెల్ స్పీకర్) బైరెడ్డిపల్లి మీదుగా కుప్పం వెళ్తు డీసీసీబీ చైర్మన్ మొగసాల రెడ్డెమ్మ క్రిష్ణమూర్తి మరియు బైరెడ్డిపల్లి ఎంపీపీ మొగసాల రెడ్డెప్ప ఆహ్వానం మేరకు వారి ఇంటికి వచ్చి తేనెటీ విందును స్వీకరించారు. నేడు జరగబోయే ముఖ్యమంత్రి కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన వైఎస్ఆర్ రాష్ట్ర కార్యదర్శి మొగసాల కృష్ణమూర్తి ఎంపీపీ రెడ్డప్ప వారి కూడా బయలుదేరి వెళ్లారు. సందర్భంగా మండలంలోని జెడ్పిటిసి, ఎంపీటీసీలు, సర్పంచ్ లు వైఎస్ఆర్ సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.










