ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండలంలో సచివాలయం రెండు లో అర్జీ ఇవ్వడం జరిగింది ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై సంతకాలు చేయించి ఇవ్వడం జరిగింది. జిల్లాలో ఖరీఫ్-2002 అతివృష్టి అనావృష్టి వల్ల అన్ని రకాల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి వేరుశనగ పత్తి మిరప కంది పొలాలలోనే కుళ్లిపోయి మొలకలు రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పులు చేసి పంటలు సాగు చేస్తే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులు అప్పులలో కూరుకుపోయి 2019లో 46 మంది 2020లో 67 మంది 2021లో 44 2022లో 62 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఖరీఫ్ 2022లో వేరుశనగ రెండు లక్షల హెక్టార్లులలో పత్తి 77 వేల హెక్టార్లలో మిరప 27 వేల హెక్టార్లలో దెబ్బతిన్నాయి. పండ్ల తోటలు చీని అరటి దానిమ్మ టమోటా ఇతర పంటలు తీవ్రంగా నష్టపోవడం జరిగింది రైతులు ఆందోళన చేస్తే ప్రభుత్వం పంట బీమా ద్వారా రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన ఖరీఫ్ సీజన్ కు ముందే ప్రకటించి భీమా ఇస్తామని ప్రభుత్వం చెప్పిన ఇప్పటివరకు బీమా ప్రకటించకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది ఖరీఫ్ ప్రారంభండంతో పెట్టుబడులకు డబ్బులు లేక అప్పులు పుట్టక రైతాంగం తీవ్ర నిరాపతో ఉన్నారు కావున వెంటనే ప్రభుత్వం గత ఖరీఫ్లో పంటలు సాగు చేసి నష్టపోయిన ప్రతి రైతుకు పంటల బీమా ప్రకటించి రైతులకు ఇచ్చి జిల్లాలో రైతాంగాన్ని ఆదుకోవడానికి ఈ క్రింది డిమాండ్లు పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఏపీ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నది డిమాండ్స్ 1 ఖరీఫ్ రబీ 2022 పంటల బీమా వెంటనే ప్రకటించి రైతుల ఖాతాలలో జమ చేయాలి 2 2021 పెండింగులో ఉన్న పంటల బీమా 39 కోట్లు వెంటనే విడుదల చేయాలి 3 రైతు భరోసా కేంద్రాలలో అన్ని రకాల విత్తనాలు ఎరువులు పురుగుమందులు అందుబాటులో ఉంచి 90 శాతం సబ్సిడీతో ఇవ్వాలి నాసిరకం కల్తీ విత్తనాలు అరికట్టాలి 4 చీని మామిడి నిమ్మ మార్కెట్లలో అమ్మకాలలో జరుగుతున్న అక్రమాలు అరికట్టాలి సూట్ తీసుకునే విధానం అరికట్టాలి 5 పెరిగిన సాగు ఖర్చులకు అనుగుణంగా అన్ని పంటలకు సి 2 +50 శాతం ఫార్ములా ప్రకారం మద్దతు ధరలు ప్రకటించాలి 6 జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలి 7 రాయలసీమకు నష్టం చేసే అప్పర్ భద్ర ప్రాజెక్ట్ అనుమతులు రద్దు చేయాలి 8 డ్రిప్పు స్వింకర్లపై జిఎస్టి రద్దుచేసి దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు 90% సబ్సిడీతో ఈ కార్యక్రమంలో ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం మండల కార్యదర్శి రాము శివ శంకర్ నారాయణ రామాంజి శ్రీనివాసులు భాష రాముడు సుంకన్న నారాయణ తదితరులు పాల్గొన్నారు.










