ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : మండలంలోని పెద్ద చెల్లారగుంట పంచాయతీ పరిధిలోని స్థానిక గ్రామాల్లో తీర్థం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది శనివారం హెల్త్ క్యాంప్ నిర్వహించారు. అందులో భాగంగా బీపీ షుగర్ పరిశీలన షుగర్ నిర్ధారణమైన వారికి 30 రోజులకు సరిపోయేలా టాబ్లెట్లు అందజేశారు
అనంతరం సిహెచ్ఓ జయంతి మాట్లాడుతూ షుగర్ వ్యాధి నిర్ధారణ అయిన వారు డాక్టర్ సలహాల మేరకు తగిన వైద్యం సకాలంలో చేయించుకుని ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలన్నారు. అంతేకాకుండా దోమలు వల్ల వచ్చే రోగాల గురించి వాటి నిర్ములన గురించి వివరించారు. జ్వరం వచ్చిన వెంటనే డాక్టర్ను కలిసి తగిన చికిత్స చేయించుకోవాలని ఆ తర్వాత కూడా జ్వరం అలాగే ఉన్నట్లయితే తీర్థం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్ష నిర్వహించి డెంగు మలేరియా చికెన్ గున్యా నిర్ధారణ వెంటనే తగిన వైద్యం చేయించుకోవాలని ఆమె అక్కడికి వచ్చిన ప్రజలకు తెలియజేశారు.
ఈ కార్యక్రమ లో సిహెచ్ఓ జయంతి, ఏఎన్ఎం పాపమ్మ, మహిళా పోలీస్ సైదా సుల్తానా, ఆశ వర్కర్, పంచాయతీ సెక్రటరీ శివప్ప పాల్గొన్నారు.










