Apr 06,2023 12:13

ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండల పరిధిలో ముట్టల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్యామిలి డాక్టర్ విధానంలో భాగంగా ముట్టాల గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్  క్యాంప్ నందు 14 రకాల ప రీక్షలు, 105 రకాల మందులు వివిధ రకాల జబ్బులకు  ఇవ్వడం జరిగింది. అలాగే 38 మంది గర్భిణీ స్త్రీలకు మరియు 7 మంది జోలీబాలింతలకు పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరిగింది. అలాగే 35 మందికి రక్తపోటు, మధుమేహం మరియు ఇతర జబ్బులను పరీక్షించి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. అలాగే దీర్ఘకాలిక జబ్బులతో మంచంమీద ఉన్న రోగులను పరీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్యులు సబిహా సుల్తానా, ఎంపిహెచ్ ఈఓ నాగేశ్వరయ్య, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ నవత,ఏఎన్ ఎమ్ లక్ష్మీ,, ఆశా కార్యకర్తలు రమణమ్మ, మల్లమ్మ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.