ప్రజాశక్తి-విచిత్తూరు : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా లక్ష్మీనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ యూనియన్ 29వ రాష్ట్ర సర్వజన మహాసభ ఆదివారం తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా లక్ష్మీనారాయణ ఆ యూనియన్ అధ్యక్షులు ఆస్కారావ్ ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఉద్యోగంతో పాటు వైద్య ఉద్యోగుల సమస్యలపై పోరాడి వారికి న్యాయం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. యాదమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికవ్వడం పట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు డాక్టర్ జ్యోతి, డాక్టర్ సురేఖ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న అన్ని శాఖల సిబ్బంది లక్ష్మీనారాయణకు అభినందనలు తెలిపారు.










