Apr 01,2023 16:31

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : నగర పాలక సంస్థ కార్మికురాలు మృతి పట్ల మేయర్ మహమ్మద్ వసీం సంతాపం వ్యక్తం చేశారు. నగరంలోని 6వ సర్కిల్ అవుట్  సోర్సింగ్ వర్కర్ లక్ష్మీదేవి శనివారం ఆరోగ్యంతోచికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న మేయర్ మహమ్మద్  వసీం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తక్షణ సాయంగా మృతురాలు కుటుంబీకులకు మట్టి ఖర్చుల కోసం రూ.15 వేలు ప్రభుత్వ ఆర్దిక సాయాన్ని అందించి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు. మేయర్ వెంట ఇంచార్జి కమీషనర్ రమణారెడ్డి, కార్పొరేటర్ అనిల్ కుమార్ రెడ్డి, ఎంహెచ్ఓ గంగాధర్ రెడ్డి, నాయకులు ఖాజా, యూనియన్ నాయకులు ఏటీఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.