మూతపడ్డ వేణుగోపాలస్వామి ఆలయం
ప్రజాశక్తి-కార్వేటినగరం: టీటీడీ అనుబంధ ఆలయాలైన శ్రీవేణుగోపాలస్వామి ఆలయం, శ్రీవరద వేంకటేశ్వరస్వామి ఆలయాలను సూర్యగ్రహణం సందర్భంగా అర్చకులు మంగళవారం మూసివేశారు. ఆలయ ప్రధాన అర్చకులు గోపాలస్వామి మాట్లాడుతూ ఈ ఏడాదికి సూర్యగ్రహణం ఇదే ఆఖరి అని, 27 ఏళ్ల తరువాత దీపావళీ రోజున గ్రహణం ఏర్పడడం విశేషం అన్నారు. దీని ప్రభావం సాయంత్రం 5.11 నుంచి రాత్రి 6.27 గంటల వరకు ఉంటుందని తెలిపారు. సూర్యగ్రహణం అనంతరం ఆలయాల్లో శుద్ధి కార్యక్రమాలు చేపట్టి, భక్తులకు సర్వదర్శనం కల్పించడం జరుగుతుందని తెలిపారు.










