Jun 04,2023 16:47

ప్రజాశక్తి - కాళ్ల
పెదఅమిరం గ్రామంలో మురుగు కాలువ ప్రక్షాళన పనులు చేపడుతున్నామని గ్రామ సర్పంచి డొక్కు సోమేశ్వరరావు ఆదివారం తెలిపారు. నాలుగు కిలోమీటర్ల పొడవునా మురుగు కాలువలో పూడికతీత పనులు చేపడుతున్నామన్నారు. కాలువల ద్వారా నీటి సరఫరా చేస్తున్న దృష్ట్యా రైతులకు నీటి సమస్య తలెత్తకుండా మురుగు కాలువ పనులు చేస్తున్నామన్నారు. వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా ఈ పనులు చేపడుతున్నామన్నారు. ఇంకా ఈ పనులు నాలుగు రోజులపాటు కొనసాగుతాయన్నారు.